11 May, 2026 | 3:41 AM

జిల్లాలో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన

11-05-2026 01:49 AM

నవదంపతులను ఆశీర్వదించిన మంత్రి

ఖమ్మం, మే 10(విజయక్రాంతి):  తెలంగాణ రెవెన్యూ,  గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదివారం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. మధిర నుంచి కూసుమంచి వరకు జరిగిన పలు శుభకార్యక్రమాల్లో పాల్గొని జనంతో మమేకమయ్యారు.  తొలుత మధిర పట్టణం జిలుగుమాడులో బోయిన శ్రీనివాసరావు - చిలక పున్నయ్యల పిల్లల వివాహ వేడుకకు హాజరైన మంత్రి, అనంతరం ఖమ్మం నగరంలోని శ్రీనివాసనగర్లో వేప అంజయ్య, సామల సత్యం కుమారుల వివాహాలకు, మామిళ్లగూడెంలో తూము అనిల్ కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యారు. దానవాయిగూడెంలో కొలిచలం గురునాధం కుమారుడి శుభకార్యానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

కైకొండాయిగూడెంలోని శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఖమ్మం ఎస్ ఆర్ హోమ్స్ లో దేవరపల్లి శ్రీనివాస రెడ్డి, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సాయి ప్రభాత్ నగర్ లో  నాగేంద్రప్రసాద్  నివాసాల్లో జరిగిన ఉప్పలమ్మ, మైసమ్మ తల్లి వేడుకల్లో పాల్గొన్నారు. ఖమ్మం రూరల్ మండలం తీర్థాలలో బానోత్ తేజా కుమార్తె వివాహానికి, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డిపల్లిలో పిట్టల గణపయ్య కుమారుడి పెళ్లికి, కేబీఆర్ నగర్లో షేక్ మోసిన్ ఖాన్ కుమారుడి రిసెప్షన్ వేడుకకు హాజరై పట్టు వస్త్రాలను కానుకగా సమర్పించారు. చివరగా కూసుమంచి మండలం పెరికసింగారంలో సండ్ర ఉపేందర్ కుమారుడి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయా ప్రాంతాల్లో మంత్రి పొంగులేటికి ప్రజలు, నాయకులు ఘనస్వాగతం పలికారు.

మధిర..

మధిర, మే10 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి మధిరలో సుడిగాలి పర్యటన చేశారు. పర్యటనలో భాగంగా ముందుగా జిలుగుమాడు లోని పివిఆర్ ఫంక్షన్ హాల్ నందు జరుగుతున్న వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం మధిర లోని సిద్దినేనిగూడెం సొసైటీ చైర్మన్ కటికల సీతారామి రెడ్డి సతీమణి కి కాలు విరిగగా వారిని పరామర్శించారు.

అనంతరం శ్రీరస్తు ఫంక్షన్ హాల్ నందు జరుగుతున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేమిరెడ్డి సుధ రెడ్డి అన్నయ్య కుమారుడు వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు డా.కోట రాంబాబు, డీసీసీబీ డైరెక్టర్ ఐలూరి వెంకటేశ్వర్ రెడ్డి, దేవిశెట్టి రంగారావు, TAC మెంబెర్స్ ఉమ్మినేని కృష్ణ, అమరవాది సత్యనారాయణ రెడ్డి, దేవరపల్లి అనంతరెడ్డి, శీలం వెంకట్రామిరెడ్డి, కపిలవాయి సత్యనారాయణ రాజు, గోళ్ళ ఉద్దండు, శీలం శ్రీనివాసరెడ్డి, అక్కినపల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.