11-09-2025 06:37:09 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): కరీంనగర్‌లోని పారమిత హెరిటేజ్ పాఠశాల(Paramita Heritage School) విద్యార్థులు కొత్తపల్లి మండలంలోని ఆసిఫానగర్ గ్రామంలో వ్యర్థాల అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. గ్రామ సహాయక క్షేత్రాధికారి శ్రీనాథ్‌తో సహా గ్రామస్తులు, పారిశుద్ధ్య కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో కాలుష్యాన్ని నివారించడం, సహజ వనరులను పరిరక్షించడం, గ్రామంలో వాతావరణ మార్పులను తగ్గించడం ద్వారా ప్రజారోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడటానికి వ్యర్థాల నిర్వహణ యొక్క ప్రాముఖ్యతపై వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ లలిత్ మోహన్ సాహు, 9వ తరగతి విద్యార్థులు జి. అదితి, ఎస్. సాన్విక, మీహా ముబారక్, వి. అమోగ్ సాయి ఎస్. జయకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ డాక్టర్ ఇ. ప్రసాద్ రావు, పాఠశాల డైరెక్టర్ హనుమంతరావు, ప్రిన్సిపాల్ గోపీకృష్ణ, సమన్వయకర్తలు రవీంద్ర పాత్రో, భవాని గ్రామస్తులలో వ్యర్థాల నిర్వహణ అవగాహనను ప్రోత్సహించడానికి పాఠశాల విద్యార్థుల చొరవను అభినందించారు.