11-09-2025 06:24:41 PM
నిర్మల్ (విజయక్రాంతి): జమ్మూలో మన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మెహ్రాజ్ మాలిక్ ని పబ్లిక్ సేఫ్టీ యాక్ట్(PSA) కింద అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్(Aam Aadmi Party District Convener Syed Haider) అన్నారు. మెహ్రాజ్ మాలిక్ ని అరెస్ట్ చేయడం కేవలం ఒక ఎమ్మెల్యే అరెస్ట్ కాదు. ఇది ప్రజాస్వామ్యంపై, ప్రజల గొంతుకపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దాడి. ఈ చర్య దేశ చరిత్రలో ఒక చీకటి రోజు. ఒక ప్రజా ప్రతినిధిని, ప్రజలచే ఎన్నుకోబడిన వ్యక్తిని పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ వంటి కఠినమైన చట్టం కింద అరెస్ట్ చేయడం అత్యంత అమానవీయం.
ఈ చట్టం సాధారణంగా దేశ వ్యతిరేక శక్తులు, తీవ్రవాదులను అదుపు చేయడానికి ఉద్దేశించింది. కానీ, బీజేపీ ప్రభుత్వం దీన్ని తమ రాజకీయ ప్రత్యర్థులను అణచివేయడానికి ఒక ఆయుధంగా వాడుకుంటోంది. మెహ్రాజ్ మాలిక్ ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడుతున్నందుకే ఆయనను టార్గెట్ చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం, ఇది ప్రజల గొంతుకను నొక్కే ప్రయత్నం. బీజేపీ ప్రభుత్వం ఇలాంటి చర్యలతో ప్రతిపక్షాలను భయపెట్టి, తమ నియంతృత్వ పాలనను కొనసాగించాలని చూస్తోంది. కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ బెదిరిపోదు, వెనకడుగు వేయదు. మనం ప్రజాస్వామ్య విలువల కోసం, ప్రజల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటామన్నారు