11-09-2025 06:46:15 PM
సింగరేణి డైరెక్టర్(పిపి) వెంకటేశ్వర్లు..
మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి ఉద్యోగులు అధికారులు సమిష్టిగా కృషిచేసి అంకితభావంతో విధులు నిర్వహించడం ద్వారా నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవడం సాధ్యమవుతుందని సింగరేణి డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ వెంకటేశ్వర్లు(Singareni Director (PP) Venkateshwarlu) అన్నారు. ఏరియా జీఎం కార్యాలయంలో బుధవారం ఉత్పాదకతపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు చేపట్టాల్సిన చర్యలను అధికారులతో చర్చించారు. అనంతరం ఏరియాలోని కేకే ఓసీపీ, పిఓబి ప్లాంటును సందర్శించారు. ఓసిపిలో బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత పెంపొందించేందుకు తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు సూచించారు. వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తెలిపారు. కేకే ఓసీలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న పిఓబి ప్లాంట్ పనుల యొక్క వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ, ఎస్ఓటు జిఎం విజయ ప్రసాద్, కెకె ఓసి ప్రాజెక్ట్ ఆఫీసర్ మల్లయ్య, పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్, గని మేనేజర్ రామరాజు, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ రవి, ఏరియా సీనియర్ అధికారులు పాల్గొన్నారు.