11-09-2025 06:39:41 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) కేంద్రంలో వివిధ ప్రభుత్వ పాఠశాలను స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న పరిశీలించారు. స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు చర్చించిన విషయాలపై అడిగి తెలుసుకున్న ఆయన 10వ తరగతి విద్యార్థులకు మంచి మార్కులు తీసుకొచ్చే విధంగా ఉపాధ్యాయులు ఇప్పటినుండి కష్టపడి పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.