11-09-2025 06:49:28 PM
నిర్మల్ (విజయక్రాంతి): తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను ప్రతి గ్రామంలో నిర్వహించుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి విలాస్(CPI District Secretary Vilas) అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో వారోత్సవాల ర్యాలీని నిర్వహించారు. ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు వారం రోజులపాటు వారోత్సవాలను జరుపుకోవాలని తెలంగాణ కోసం అమరులైన త్యాగదనుల సేవలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్ ఎన్ రెడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు.