calender_icon.png 19 November, 2025 | 9:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

100 అడుగుల జాతీయ జెండా

16-08-2024 01:31:30 AM

కోదాడలో ఏర్పాటు

సూర్యాపేట, ఆగస్టు15 (విజయ క్రాంతి): సూర్యాపేట జిల్లా కోదాడలో 100 అడుగుల జాతీయ జెండా ఏర్పాటు చేయడం పట్టణంతోపాటు రాష్ట్రానికి గర్వకారణమని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిరెడ్డి పేర్కొన్నారు. గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ (ఐవీవో) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 100 అడు గుల జాతీయ పతాకాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం మాట్లా డుతూ.. దేశ సరిహద్దుల్లో సేవలందించి పదవీ విరమణ అనంతరం ప్రజల్లో దేశభక్తి పెంపొందించేందుకు ఆర్గనైజేషన్ సభ్యులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.