calender_icon.png 19 November, 2025 | 8:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జపాన్‌లో వేడుకలు

16-08-2024 01:30:41 AM

గజ్వేల్ , ఆగస్టు 15 : జపాన్ లోని హిరోషిమాలో గజ్వేల్ కు చెందిన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ గుడాల రాధాకృష్ణ బృం దం గురువారం భారత స్వాతంత్ర వేడుకలను జరుపుకున్నారు. స్టార్ హెల్త్ సంస్థ ద్వారా జపాన్ లో సీఈవో క్లబ్ అవార్డు అందుకోవాడనికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ వెళ్లారు. గురువారం హిరోషిమాలో భారత స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలను జరుపుకొన్నారు. జాతీయ జెండా ఎగురవేసి, జాతీయ గీతాన్ని ఆలపించి, స్వీట్స్ పంచి వేడుకలు చేసుకున్నారు. గత ఏడాది కూడా రాధాకృష్ణ బృందం దక్షిణాఫ్రికాలో స్వాతంత్ర దినోత్సవ సంబరాలను జరుపుకోవడం విశేషం.