calender_icon.png 19 November, 2025 | 10:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరికీ స్వాతంత్య్ర ఫలాలు

16-08-2024 01:32:16 AM

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

సూర్యాపేట, ఆగస్టు 15: ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే స్వాతంత్య్రమని, దాని ఫలితాలను అందరికీ అందేలా చేయడమే ప్రభుత్వ ధ్యేయమని పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్య్ర దినోత్సవంలో పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ.. ప్రభు త్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహలక్ష్మీ, ఆరోగ్యశ్రీ పథకాలను పేదలకు అందించిందని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా రాష్ట్రంలో 4.5 లక్షల ఇండ్లు నిర్మించేందుకు ఇంటికి రూ.5 లక్షలు ఇచ్చామని తెలిపారు.