16 April, 2026 | 3:24 AM

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

01-03-2026 12:10 AM

వికారాబాద్ పట్టణంలో ఘటన

వికారాబాద్, ఫిబ్రవరి -28: మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం వికారాబాద్ పట్టణం లో కలకలం రేపింది. వికారాబాద్ పట్టణంలోని గంగారం సాయి బాబా కాలనీనికి చెందిన బలిజ దివ్య(22) కోటపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ, దారూర్ సీఐ కార్యాలయానికి అటాచ్‌గా పనిచేస్తున్నారు. శనివారం ఉదయం ఇంట్లోని తన గది నుంచి బయటకు రాకపోవడంతో కుటుంబీకులు తలుపు తెరిచి చూడగా ఫ్యానుకు ఉరేసుకుని విగత జీవిగా కనిపించింది.

విషయం తెలుసుకున్న వికారాబాద్ పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా తన చావుకు ఎవరూ కారణం కాదని, నాన్న లేని లోటుతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసై డ్ నోట్‌లో రాసినట్టు తెలిసింది.