1 March, 2026 | 9:02 AM

రజక ఎమ్మెల్యేను నిలదీయాలి

01-03-2026 12:00 AM

శంకయ్య దిష్టిబొమ్మను దహనం చేయాలి

బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం

బీసీ ఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యాల నర్సింహులు

హైదరాబాద్, ఫిబ్రవరి 28(విజయక్రాంతి) : పదవుల కోసం అగ్రకులాల ప్రభుత్వ పెద్దలకు ఊడిగం చేస్తూ కుమ్మెర బాధిత కుటుంబాన్ని అవమానపరిచేలా మాట్లాడిన రజక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్యను ఎక్కడికక్కడ నిలదీయాలని బీసీ ఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యాల నర్సింహులు పిలుపునిచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర బాధి తుల పక్షాన కాకుండా  అగ్రకులాలకు వత్తాసు పలికేలా వ్యవహరించిన ఎమ్మెల్యే దిష్టి బొమ్మలను రాష్ట్ర వ్యాప్తంగా దహనం చేయాలని ఒక ప్రకటనలో కోరారు.

పసికందు చావును హంతకుల కాళ్లముందు పెట్టి అసందర్బ,అబద్ధ ప్రగల్బాలు, మూర్ఖపు దుర్మార్గపు మాటలు పలుకుతూ ఉద్యమాన్ని ప్రజల నమ్మకాన్ని ఎమ్మెల్యే వమ్ము చేశాడని మండిపడ్డారు. ఉదమాన్ని నీరుగార్చేందుకు రజక జాతికి అన్యాయం చేస్తూ  మంత్రి పదవి కోసం రెడ్ల కాళ్లకు రెడ్ కార్పెట్ పరిచి బానిసలా చెంచాగిరి చేస్తున్న ఎమ్మెల్యే శంకరయ్యకు తగిన బుద్ధి చెప్పాలని కోరా రు. స్వార్థపరులను రజక జాతి నుంచి వెలివేయాలని కోరారు. కుమ్మెర బాధిత కుటుం బానికి న్యాయం జరిగే వరకూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.