09-09-2025 05:11:18 PM
నగర ఎంఐఎం అధ్యక్షుడు గులాం అహ్మద్ హుస్సేన్..
కరీంనగర్ (విజయక్రాంతి): మహమ్మద్ ప్రవక్త జన్మదిన మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 13న ఎంఐఎం పార్టీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ దారుసలాంలో నిర్వహించ తలపెట్టిన జల్సా రహమతుల్-లీల్-ఆలమీన్ ఆధ్యాత్మిక బహిరంగ సభను, కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి వందలాదిగా ఎంఐఎం శ్రేణులు హాజరై విజయవంతం చేయాలని, పార్టీ నగర అధ్యక్షుడు సభ్యుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ పిలుపు నిచ్చారు. ఈసందర్భంగా గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ.. కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి సుమారు100 వాహనాలలో 500 మంది, కరీంనగర్ పట్టణం నుంచి 38 డివిజన్లలో ప్రతి డివిజన్ నుంచి 4కార్ల చొప్పున 125 వాహనాలలో దాదాపు 700 మంది ఎంఐఎం పార్టీ నాయకులు, డివిజన్ల అధ్యక్షులు, కార్యదర్శులు, క్రియాశీలక కార్యకర్తలు హైదరాబాద్ రావాలని కోరారు.
ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ ఏడాది కూడా భారీ ఎత్తున క్రియాశీలక కార్యకర్తలను కూడగట్టి ఎక్కువ సంఖ్యలో వెళుతామని చెప్పారు. ఈకార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, నాయకులు సయ్యద్ బర్కత్ అలీ, హాఫిజ్ మొయిజుద్దీన్ ఖాద్రి యూసుఫ్, ఆతిన, ఇబ్రహీం, అఖీల్ ఫిరోజ్, శర్ఫుద్దీన్, అజర్, మొహాసీన్ మొహియుద్దీన్, సాజిద్, ఇస్మాయిల్, సలీం, ఆరిఫ్ అహ్మద్, మాజిద్ హుస్సేన్, మజారోద్దీన్, ఆవేజ్, షాకిర్ నహ్ది, అబ్దుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు.