calender_icon.png 9 September, 2025 | 10:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన వందరోజుల ప్రత్యేక ప్రణాళిక

09-09-2025 05:05:32 PM

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందరోజుల ప్రణాళిక కార్యక్రమం మంగళవారంతో ముగిసింది. ఈ సందర్భంగా నల్గొండ పట్టణంలోని పలు ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలలో శానిటేషన్ డ్రైవ్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా నల్గొండ మున్సిపల్ సహాయ కమిషనర్ రవీందర్ రెడ్డి రాంనగర్ మున్సిపల్ పార్కులో జరుగుతున్న శానిటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 100 రోజుల ప్రణాళిక సందర్భంగా నల్గొండ పట్టణంలో శానిటేషన్పై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు. చిన్న కాలువలో పెద్ద కాలువలలో మిషన్లో కార్మికులతో కలిసి పూడికతీత పనులు చేపట్టడం జరిగిందన్నారు.

వనమహోత్సవ కార్యక్రమంలో చెట్లను నాటి వాటి సంరక్షణ కార్యక్రమాలు చేయడంతో పాటు ఇంటింటికి చెట్లను పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. అనధికార భవనాలను గుర్తించి వాటికి అసైన్మెంట్లు చేసి భువన యాప్ లో వివరాలు పొందుపరచడం జరిగిందన్నారు. అక్రమంగా ఉన్న  ట్రేడ్ లైసెన్స్, నల్లాలను గుర్తించి వాటిని రెగ్యులర్ చేయడం జరిగిందని తెలిపారు. తడి చెత్త పొడి చెత్త హానికర చెత్త పై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాలను ఈ ప్రణాళికనే కాకుండా నిరంతరంగా కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్లు గడ్డం శ్రీనివాస్, నంద్యాల ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.