9 May, 2026 | 11:50 AM

కాళోజీ నారాయణ జయంతి వేడుకలు

09-09-2025 05:08 PM

హాజీపూర్ (విజయక్రాంతి): హాజీపూర్ మండలం(Hajipur Mandal)లోని గుడిపేట 13వ బెటాలియన్ లో మంగళవారం తెలంగాణ ప్రజా కవి కాళోజీ నారాయణ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కమాండెంట్ పి వెంకట రాములు పూలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాళోజి విప్లవాత్మక కవిత్వాన్ని స్మరించుకుంటూ ప్రజలలో చైతన్యం కలిగించారని, ఆయన ఆలోచనలు, పదాలు సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం కోసం ప్రతి తరానికి మార్గదర్శకంగా నిలిచాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ కాళిదాస్, నాగేశ్వరరావు, బాలయ్యతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.