09-09-2025 05:02:09 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): కళాకారులను ప్రోత్సహించి వారిని గుర్తింపు ఇవ్వడం హర్షనీయమని గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పరశురామ్ గౌడ్ అన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా(Karimnagar District) కేంద్రంలోని కళాభారతిలో బిట్ బిట్ డ్యాన్స్ అకాడమీ దసరా దీపావళి కళాకారులకు ఇచ్చే పురస్కారాల అవార్డు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కళామతల్లి ఒడిలో ఎందరో కళాకారులు పుట్టుకొస్తున్నారని అయినా గుర్తింపు రావడంలేదని ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే వారికో గుర్తింపు ఇచ్చిన వారైతారని ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ 19న నిర్వహించే బిట్ బిట్ డాన్స్ అకాడమీ అవార్డు కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు.
కరీంనగర్ కళాభారతిలో బిట్ బిట్ డాన్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగిందని ప్రముఖ డాన్స్ మాస్టర్ పులిపాక దేవా పేర్కొన్నారు. ఆసక్తి కలవారు తమ పేరును పులిపాక దేవా. 91777 09 591. వీర్ల ప్రశాంత్ సెల్ నెంబర్ 9866 426371 కు సంప్రదించాలని పేర్లు అక్టోబర్ 10వ తేదీ లోపున పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
అక్టోబర్ 19న కళాభారతిలో జరిగే విజయదశమి, దీపావళి పురస్కారాల అవార్డులు అందజేయడం జరుగుతుంది అని దేవా తెలిపారు.. ఈ కార్యక్రమంలో మానవ వికాస వేదిక రాష్ట్ర కన్వీనర్ దాసరి రామస్వామి , పెద్దపల్లి జిల్లా కళాకారుల అధ్యక్షుడు బుర్ర గడ్డ రవి, భూపెల్లి మల్లేష్, వీర్ల ప్రశాంత్, జబ్బార్ ఖాన్ , ధర్మరాజు కరీంనగర్, ధనరాజ్, తాళ్లపల్లి సంధ్య, రామకృష్ణ, రజాక్, ముజ్జు, వంశీ, ఆకన భాస్కర్, శేఖర్ నాయుడు, సాయి అనిల్, వంశీ నాథ్, తదితరులు పాల్గొన్నారు.