09-09-2025 05:00:13 PM
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి అండర్-17, 14 క్రీడ పోటీల్లో లోతుకుంట గ్రామం పరిధిలో గల మోడల్ స్కూల్ విద్యార్థినిలు, విద్యార్థులు సత్తాచాటారు. అండర్-17 కోకో పోటీలలో మోడల్ స్కూల్ కు చెందిన బాలికలు, బాలురు ప్రథమ బహుమతులను, అండర్-17 వాలీబాల్ పోటీలలో బాలికలు ప్రథమ బహుమతిని, అండర్-17 కబడ్డీ పోటీలలో బాలురు ద్వితీయ బహుమతిని, అండర్-14 కోకోలో బాలికలు ద్వితీయ బహుమతిని, 100 మరియు 200 మీటర్ల పరుగు పందెంలో మోడల్ స్కూల్ చెందిన లోకేష్ ప్రధమ బహుమతిని, వంద మీటర్ల పరుగు పందెంలో మైథిలి ద్వితీయ బహుమతిని సాధించారు. ఈ సందర్భంగా సత్తా చాటిన మోడల్ స్కూల్ విద్యార్థినీలను, విద్యార్థులను మండల విద్యాధికారి సుంకోజు భాస్కర్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రయిసున్నిసా బేగం, పిఈటి ఐలయ్య అభినందించారు.