09-09-2025 04:58:20 PM
పల్లా నరసింహారెడ్డి
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
దేవరకొండ: భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం దొరలు, భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు ఘనంగా నిర్వహించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహారెడ్డి(CPI State Executive Member Palla Narasimha Reddy) పిలుపునిచ్చారు. మంగళవారం దేవరకొండ పల్లా పర్వత రెడ్డి భవన్లో జరిగిన నియోజకవర్గ సిపిఐ సమావేశంలో వారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంతంలో నైజాంకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటం భారతదేశ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లికించదగినదని అన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత అత్యధికంగా ఉన్నదని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పై కక్షగట్టి రాష్ట్రానికి రావాల్సిన యూరియా కోటాను ఇవ్వకుండా మోసం చేస్తుందని ఆరోపించారు. రైతుల వ్యవసాయానికి సరిపడా యూరియాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశం లో ఉప్పునూతల వెంకటయ్య,సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, తూము బుచ్చి రెడ్డి, ఎండి మైనోద్దీన్, కనకాచారి,దేప సుదర్శన్ రెడ్డి జి వెంకటేశ్వర రెడ్డి, జయరాములు తదితరులు పాల్గొన్నారు.