calender_icon.png 24 May, 2025 | 8:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలి

22-05-2025 01:12:38 AM

జిల్లా ఎస్పీ రావుల గిరిధర్

వనపర్తి టౌన్ మే 21: మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే వనపర్తి జిల్లాలో బక్రీద్, హనుమాన్ జయంతి పండుగలను సోదర భావంతో శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు.

జూన్ 7వ తేదీన జరగబోయే బక్రీద్, హనుమాన్ జయంతి పండుగల సందర్భంగా బుధవారం రోజు జిల్లా పోలీసు కార్యాలయం సమావేశ భవనంలో మతపెద్దలతో శాంతి సమావేశాన్ని  నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ .. బక్రీద్ ,హనుమాన్ జయంతి పండుగ పర్వదినాలను శాంతియుత వాతావరణంలో పరస్పరం మతాలను గౌరవించుకుంటూ పండుగ జరుపుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా పండగలను ప్రతి ఒక్కరూ జ రుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల మీదుగా వచ్చే పశువుల అక్రమ రవాణా కట్టడికి జిల్లా పరిధిలో పశుసంవర్ధక శాఖ సిబ్బందితో  3 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి పశువులను రవాణాచేసే ప్రతి వాహనానికి తగు నిర్థారిత ప్రమాణిక పత్రాలు (వాలిడ్ డాక్యుమెంట్స్) ఉంటేనే, పరిశీలించి అనుమతిస్తారని అన్నారు.ఈ శాంతి సంఘ సమావేశంలో వనపర్తి డిఎస్పీ, వెంకటేశ్వరరావు,డిసిఆర్బి డీఎస్పీ, ఉమామహేశ్వరరావు, వనపర్తి మున్సిపల్ కమిషనర్, ఎన్ వెంకటేశ్వర్లు, వనపర్తి సిఐ, కృష్ణయ్య, స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్, వనపర్తి పశువైద్యశాఖ ఏడి, మీరజ్ అహ్మద్, వెటర్నరీ డాక్టర్, మల్లేష్, జిల్లాలోని గోషాల నిర్వహకులు, వివిధ కులాల మత పెద్దలు పాల్గొన్నారు.