calender_icon.png 24 May, 2025 | 5:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధే లక్ష్యం కేంద్రంతో సఖ్యత

24-05-2025 01:34:05 AM

గేట్ వే ఆఫ్ ఇండస్ట్రీగా జహీరాబాద్

  1. ప్రధానిని ఎన్నిసార్లయినా కలుస్తా..
  2. నిమ్జ్‌లో భూమి కోల్పోయిన వారికి 5,612 ఇందిరమ్మ ఇండ్లు
  3. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని నంబర్ వన్ చేస్తా
  4. జహీరాబాద్‌లో షుగర్ ఫ్యాక్టరీ కోసం భూమి కేటాయిస్తా
  5. జహీరాబాద్‌లో రూ. 494.67 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభోత్సవం

సంగారెడ్డి, మే 23 (విజయక్రాంతి)/జహీరాబాద్: రాష్ట్ర అభివృద్ధే తన లక్ష్యమని, ఇందుకు తమ ప్రభుత్వం కేంద్రంతో కలిసి పనిచేస్తోందని ముఖ్యమ్రంతి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.  ఉమ్మడి మెదక్ జిల్లాలోని జహీరాబాద్‌ను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడమే కాకుండా, తెలంగాణ రాష్ట్రానికి గేట్ వే ఆఫ్ ఇండస్ట్రీగా మార్చుతానని హామీనిచ్చారు.

శుక్రవారం ముఖ్యమంత్రి సంగా రెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో రూ.494.67 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభో త్సవాలు చేశారు. ఈ సందర్భంగా పస్తాపూర్‌లో ఏర్పాటుచేసిన బహిరంగ సభకు ఆయ న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభకు జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ అధ్యక్షత వహించారు.

అంతకుముందు హుగ్గెళ్లి చౌరస్తాలో మహాత్మా బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. సభను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, జహీరాబాద్‌లో నిమ్జ్ భూ సేకరణ పనులు వేగవంతం చేశామని, త్వరలోనే ఈ ప్రాంతాన్ని గేట్ వే ఆఫ్ ఇండస్ట్రీగా మార్చడానికి తన శాయశక్తులా కృషి చేస్తానన్నారు.

ఈ ప్రాంతంలో 12,600 ఎకరాలలో నిమ్జ్ ఏర్పాటు కాంగ్రె స్ ప్రభుత్వ హయాంలో జరిగిందని, అయితే 2014 తర్వాత ఈ ప్రాంత అభివృద్ధి కుంటుపడిందన్నారు. తాను సీఎంగా బాధ్యతలు చేపట్టాక నిమ్జ్‌లో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం పెంచడమే కాకుండా పారిశ్రామిక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్న ట్లు తెలిపారు. జహీరాబాద్ పారిశ్రామిక వాడలో భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు.

దాదా పు 5,612 కుటుంబాలు భూములను కోల్పోయారని, వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఈ బాధ్యతను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి అప్పగిస్తున్నానని, జిల్లా కలెక్టర్ వెంటనే సమీక్ష నిర్వహించి గుర్తించాలని, వారందరికి ఇండ్ల పట్టాలు అం దేలా చూడాలని ఆదేశించారు. ఈ ప్రాం తానికి ఆటోమొబైల్ సంస్థలను తీసుకువచ్చామని, హుండాయ్ కార్ల ఉత్పత్తికి 450 ఎకరాలను కేటాయించినట్లు చెప్పారు.

రాష్ట్రానికి ఆదాయం రావాలంటే పరిశ్రమలు రావాలని, వాటివల్ల ఉద్యోగాలు లభిస్తాయని, ఆదాయం పెరిగితే పేదలకు పంచాలనే లక్ష్యంతో తాను పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు ప్రతిపక్షం సహకారం కావాలని, వారి సూచనలు, సలహాలు స్వీకరించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు, లక్ష ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించినట్లు వివరించారు. 15 నెలల్లో 3 లక్షల కోట్ల విదేశీ పెట్టుబడులతో పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నా మని చెప్పారు. 

మోదీని 50సార్లయినా కలుస్తా..

రాష్ట్రం అభివృద్ధ్ది చెందాలంటే కేంద్ర నిధులు ఎంతో అవసరమని, రాష్ట్రం, కేం ద్రం సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇందుకోసం కేంద్రంతో మాట్లాడతామని, ప్రధాని మోదీని 50 సార్లయినా కలుస్తానని, ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసిన తనకు రాష్ట్ర అభివృద్ధే ముఖ్యమన్నారు. తాను 20 ఏళ్ళలో ఎన్నడూ అధికారంలో లేనని, ప్రతిపక్షంగా ఉంటూ ప్రజాగొంతుకగా నిలిచాను కాబట్టే ప్రజలు తనకు సీఎం పదవి అప్పగించారని చెప్పారు. ప్రతిపక్ష నేత అలిగి ఫాంహౌజ్‌కు పరిమితం అయ్యారని విమర్శించారు. చెరువు మీద అలిగితే నష్టం మనకేనని సీఎం అన్నారు.

మహిళలను కోటీశ్వరులను చేస్తా..

రాష్ట్రంలో కోటిమంది మహిళలను ఐదేళ్ళలో కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇందుకోసం వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు భాగస్వామ్యం చేస్తున్నట్లు తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు 20వేల కోట్లతో బ్యాంక్ లింకేజీ కల్పించామని, ఈయేడు రూ.21 వేల కోట్లు కేటాయించనున్నట్లు రేవంత్‌రెడ్డి చెప్పారు. ఉచిత బస్సు పథకం వల్ల 5,500 కోట్లు ఆర్టీసీకి కేటాయించామని, ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బతికేలా చేస్తున్నామని తెలిపారు. మహిళలకే సుమారు 600 అద్దె బస్సులను కేటాయించి వారికి ఆదాయం పెంపొందిస్తున్నామన్నారు. 

మహిళా సాధికారతే లక్ష్యం 

మంత్రి కొండా సురేఖ 

తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారితకు కట్టుబడి ఉన్నదని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని, అందులో భాగంగానే మహిళా సంఘాలకు పెట్రోల్ పంపులు మంజూరు చేస్తు న్నారని తెలిపారు. అందుకు ఉదాహరణగా జహీరాబాద్‌లోని మహిళా సంఘా నికి పెట్రోల్ పంపులు మంజూరు చేశారని తెలిపారు. 

మెదక్ అభివృద్ధికి ఇందిరా గాంధీ కృషి 

మంత్రి దామోదర రాజనర్సింహ

ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధికి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎంతో కృషి చేశారని, ఆమెకు ఈ జిల్లా పట్ల ఎంతో అభిమానం ఉండేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నా రు. జిల్లా అభివృద్ధికి ఎన్నో పరిశ్రమలను తీసుకొచ్చారని గుర్తు చేశారు. జహీరాబాద్ ప్రాంతంలో బీడీఎల్ లాంటి కంపె నీలను తెచ్చి ప్రజలకు ఉపాధి కల్పించాలని తెలిపారు.

ఆమె జీవిత చరిత్ర మెదక్ జిల్లాకు మైలురాయని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయని, ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని దీనిని దృష్టిలో పెట్టుకొని సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని అన్నారు. ఈ జిల్లాకు ఎంతో మంచి పేరుందని, జిల్లాతో పాటు జహీరాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

చెరుకు ఫ్యాక్టరీకి వంద ఎకరాలు కేటాయిస్తా.. 

జహీరాబాద్ ప్రాంతం చెరుకు సాగుకు ప్రసిద్ధిగాంచిందని, అయి తే ఇక్కడ ఫ్యాక్టరీ మూతపడడంతో చెరకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జహీరాబాద్ ఎం పీ సురేష్ షెట్కార్ సీఎం దృష్టికి తీసుకువెళ్ళగా ఆయన స్పందిస్తూ, రైతులు కో ఆపరేటివ్ సొసైటీగా ఫ్యాక్టరీని నడిపించుకుంటే నిధులు మంజూరు చేస్తానని హామీనిచ్చా రు. అలాగే ఫ్యాక్టరీ ఏర్పాటుకు వంద ఎకరాల స్థలాన్ని నిమ్జ్‌లో కేటాయిస్తామని చెప్పారు.

అవసరమైతే కేంద్రం నుంచి నిధులు తెచ్చే బాధ్యత తీసుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ్మ, కొండా సురే ఖ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షె ట్కార్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు మాణిక్యరావు, సంజీవరెడ్డి, మదన్‌మోహన్‌రావు, టీజీ ఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, షబ్బీర్‌అలీ, గిరిధర్‌రెడ్డి, నీలం మ ధు, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు పాల్గొన్నారు.