22-07-2025 12:22:30 AM
ఢాకా, జూలై 21: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ఢాకాలోని ఉత్తర ప్రాం తంలోని మైల్‌స్టోన్ పాఠశాలపై బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఫ్-7బీజీఐ శిక్షణ యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 2౦ మంది మృతి చెంద గా.. 70 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయం లో పాఠశాలలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. విమానం కూలిన సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్టు స్థానికులు పేర్కొన్నారు. మరోవైపు చైనాలో తయారైన ఎఫ్-7జీబీఐ ఎ యిర్‌క్రాఫ్ట్ కూలిపోయినట్టు బంగ్లాదేశ్ ఆర్మీ అధికార ప్రతినిధి ధ్రువీకరించారు.
చైనాలో నిర్మితమైన ఎఫ్- 7 యుద్ధ వి మానం కూలిపోవడం ఈ ఏడాదిలో రెండోసారి. గత నెలలో మయన్మార్ వైమానిక ద ళానికి చెందిన ఎఫ్-7 యుద్ధ విమానం సా గింగ్ ప్రారంతంలో కూలిపోయింది. దీంతో చై నాలో తయారవుతున్న ఫైటర్ జెట్ల నాణ్యత పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.