calender_icon.png 22 July, 2025 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విదేశీ మీడియా అసత్య ప్రచారాలు

22-07-2025 12:20:06 AM

పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

న్యూఢిల్లీ, జూలై 21: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై రాజ్యసభలో చర్చ జరిగింది. దీనిపై విపక్షాలు అడి గిన ప్రశ్నలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సమాధానమిచ్చారు. ఈ ప్రమాదంపై విదేశీ మీడి యా అసత్య ప్రచారం చేస్తోందని తెలిపారు. అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనపై ప్రాథ మిక నివేదిక వచ్చింది.

తుది నివేదిక వచ్చాకే దీనిపై మరిన్ని వివరాలు తెలుస్తాయి. ప్రమాదంపై ఏఏఐబీ దర్యాప్తు జరుపుతోంది. కానీ ఈ ఘటనపై విదేశీ మీడియా అసత్య ప్రచారం చేస్తోంది. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సొంత అభిప్రాయాలు చెప్పకూడదు. విదేశీ ప్రొటోకాల్‌కు అనుగుణంగా దర్యాప్తు కొనసాగుతోంది’ అని తెలిపారు.