calender_icon.png 23 November, 2025 | 12:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాములు మరణం పట్ల ఫిలిం సొసైటీ సంతాపం

10-02-2025 01:15:21 AM

కొత్తపల్లి, ఫిబ్రవరి09: కరీంనగర్ ఫిలిం సొసైటీ వ్యవస్థాపకంలో ఒకరైన రేణికుంట రాములు అకాల మరణం పట్ల కరీంనగర్ ఫిలిం సొసైటీ సంతాపం వ్యక్తం చేస్తూ  సంస్మరణ సభ నిర్వహించింది.  కార్యక్రమంలో రేణికుంట రాములు గారి కుమారులు సతీష్ కుమార్ శ్రీధర్ బాబుచే వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా కపిసో అధ్యక్షులు పొన్నం రవిచంద్ర మాట్లాడుతూ రేణికుంట రాములు వివిధ హోదాల్లో సంస్థ అభివృద్ధికి చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా రాములు మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.  కార్యక్రమంలో వరాల మహేష్ మాట్లాడుతూ వారిద్దరూ కలిసి చేసిన సేవలను గుర్తుచేసుకొని సంతాపం వ్యక్తం చేశారు.

ఉప్పల రామేశం, చింత కింది వేణుగోపాల్, ఆనంద్ మాట్లాడుతూ ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఫిలిం సొసైటీ  కార్యదర్శి లక్ష్మీ గౌతమ్ కోశాధికారి అనిల్ కుమార్ ఉపాధ్యక్షులు కోల రామచంద్రారెడ్డి జాయింట్ సెక్రెటరీలు తొడుపునూరి దశరథం కొమరవెల్లి వెంకటేశం సభ్యులు రమేష్, లక్ష్మణ్ కుమార్,  ఉప్పుల  రఘురాం, గాజు నాగభూషణం సదాశ్రీ మరియు  వారి కుటుంబ సభ్యులతోపాటు  కరీంనగర్ ఫిలిం సొసైటీ లైఫ్ మెంబర్స్ పాల్గొన్నారు.