calender_icon.png 23 November, 2025 | 12:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేను మీ పాత బస్టాండ్.. గుర్తున్నానా..?

10-02-2025 01:16:01 AM

వనపర్తి, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి) : నేను మీ పాత బస్టాండ్ వనపర్తి జి ల్లా ప్రజలందరికి సుపరిచి తమే. కొత్త బస్టాండ్ కట్టక ముందు ఎంతో మంది ప్రయాణికులకు ఆశ్రయం ఇవ్వడంతో పాటు సేవలను కూడా అందించాను. పట్ట ణ ప్రజలు అందరు అధికారులు కూడా నా ముందు గల రోడ్డు వెంబడి వెళ్ళు తున్నారు.

కానీ నావైపు ఎవరు కూడా కన్నెత్తి చూడడం లేదు పట్టించుకోవడం లేదు ఒక్కప్పుడు అన్ని సేవలను అందించిన నేను ఎవరు పట్టించుకోక పోవడంతో మల మూత్ర విసర్జన కార్యక్రమాలకు నిలయంగా మారిపోవడంతో పాటు కంపు భరించలేక పోతున్నాను. మళ్ళీ వినియోగంలోకి తీసుకుని మరిన్ని సేవలను అందించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు.