10-02-2025 01:15:04 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): హాంకాంగ్ హ్యాపీ వ్యాలీలోని హిందూ దేవాలయంలో ఆదివారం ప్రవాస భారతీయులు సత్యనారాయణస్వామి వ్రతాన్ని ఘనంగా నిర్వ హించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా భారత కాన్సులర్ కే వెంకటరమణ హాజర య్యారు. కొత్తగా వివాహం చేసుకున్న జంటలతో భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వ్రతాన్ని నిర్వహించినట్టు వ్యవస్థాపక అధ్యక్షురాలు పీసపాటి జయ తెలిపారు.
వ్రతాన్ని గత పదేండ్లుగా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నట్టుచెప్పారు. ఇలాంటి సామూహిక పూజలు యువతరంలో ఆధ్యాత్మికాభివృద్ధికి దోహదపడతాయని కాన్సులర్ కే వెంకటరమణ పేర్కొన్నారు.