30-10-2025 12:00:00 AM
 
							నవీముంబై, అక్టోబర్ 29 : మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత జ ట్టు సెమీఫైనల్‌కు సిద్ధమైంది. గురువారం నవీముంబై వేదికగా డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను ఢీకొనబోతోంది. ఈ మెగాటోర్నీని వరుసగా రెండు విజయాలతో ఘనంగా ఆరంభించిన భారత్ తర్వాత హ్యాట్రిక్ పరాజయాలతో వెనుకబడింది. అయితే న్యూజిలాండ్‌పై డూ ఆర్ డై పోరు లో చెలరేగి కీలక విజయాన్ని అం దుకోవడమే కాకుండా సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది.
టైటి ల్ ఫేవరెట్ ఆసీస్‌ను ఓడించడం భారత్‌కు అంత ఈజీ కాదు. టోర్నీలో అపజయ మే లేని జట్టుగా సెమీస్‌కు దూసుకొచ్చిన కంగారూలు అన్ని విభా గాల్లోనూ అత్యంత బలంగా ఉన్నారు. గతంలో రెండుసార్లు ఫైనల్ వరకూ సెమీస్‌కు ముందు భారత్ ఓపెనర్ ప్రతీకా రావల్ గాయంతో తప్పుకోవడం ఎదురుదెబ్బ గా మారింది. ఆమె స్థానంలో వచ్చిన షెఫాలీ వర్మ అంచనాలకు తగ్గట్టు రాణించాల్సిం దే.
మిగిలిన బ్యాటింగ్‌లో స్మృతి, హర్మన్ ప్రీత్, దీప్తి శర్మ ఫామ్‌లో ఉన్నా రు. బౌలింగ్‌లో మాత్రం భారత్ మరింత మెరుగుపడాల్సి ఉంది. క్రాంతి గౌడ్, స్నేహా రాణా, శ్రీచరణి, రేణుకా సింగ్‌పైనే విజయా వకా శాలు ఆధారపడి ఉన్నాయి. 
మ్యాచ్‌కు వర్షం ముప్పు
భారత్,ఆసీస్ సెమీఫైనల్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశ ముంది. అయితే సెమీఫైనల్స్, ఫైనల్స్‌కు రిజర్వే డే ఉంది. రిజర్వ్ డేలో కూడా ఆట సాధ్యం కాకుంటే మాత్రం ఆసీస్ ఫైనల్‌కు చేరుతుంది.