8 April, 2026 | 1:53 PM

భారత్ వేదికగా ఫైనల్

17-12-2024 11:54 PM

వరల్డ్ బాక్సింగ్ కప్

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు భారత్ ఆతిథ్యమివ్వనున్నట్లు మంగళవారం ప్రపంచ బాక్సింగ్ సమాఖ్య తెలిపింది. వచ్చే ఏడాది నవంబర్‌లో భారత్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనున్నట్లు తెలిపింది. టోర్నీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్ జనవరిలో రానుంది. కాగా బాక్సింగ్ ప్రపంచకప్ తొలుత బ్రెజిల్‌లో మొదలై జర్మనీ, కజకిస్థాన్, భారత్‌లో ముగియనుంది. అదే సమయంలో భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ) వరల్డ్ బాక్సింగ్ సదస్సును నిర్వహించనుంది. కాగా, గతేడాది మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ భారత్‌లో జరిగిన సంగతి తెలిసిందే.