calender_icon.png 13 November, 2025 | 5:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోవాకు షాకిచ్చిన ఒడిశా

18-12-2024 12:19:40 AM

* ఢిల్లీ, కేరళకు విజయాలు

* సంతోష్ ట్రోఫీ

హైదరాబాద్: సంతోష్ ట్రోఫీలో భాగంగా ఐదుసార్లు చాంపియన్ గోవాకు ఒడిశా షాకిచ్చింది. నాలుగో రోజైన మంగళవారం హైదరాబాద్ వేదికగా గ్రూప్ జరిగిన తొలి మ్యాచ్‌లో ఒడిశా 2 గోవాను ఓడించింది. ఒడిశా తరఫున రాహుల్ ముఖి (60వ నిమిషంలో), కార్తిక్ హంతల్ ( 64వ ని.లో) గోల్స్ సాధించారు. గోల్ లేకుండానే తొలి హాఫ్ ముగియగా.. రెండో అర్థభాగంలో మాత్రం గోవాపై ఆధిపత్యాన్ని ప్రద ర్శించిన ఒడిశా విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఒడిశా పట్టికలో మూడో స్థానానికి చేరింది. మరో మ్యాచ్‌లో ఢిల్లీ 2 తమిళనాడును చిత్తు చేసింది. రెండు వరుస విజయాలతో ఢిల్లీ గ్రూప్ ఆరు పాయింట్లతో తొలి స్థానంలో ఉంది. బన్సల్ (7వ ని.లో), ఆశిష్ షా (65వ ని.లో) ఢిల్లీకి గోల్స్ అందించారు. మూడో మ్యాచ్‌లో కేరళ 1 తేడాతో మేఘాలయాపై విజయం సాధించింది.