18-10-2025 04:21:47 PM
ఘట్ కేసర్ (విజయక్రాంతి): ఘట్ కేసర్ మున్సిపల్ కొండాపూర్ లోని సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్-2025 ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని మై భారత్ ఎన్ఎస్ఎస్ యూనిట్, సంస్కృతి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల సంయుక్తంగా నిర్వహించాయి. ఈ క్రీడా పోటీలలో 10 కాలేజీలకు చెందిన 200 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు క్రీడాస్ఫూర్తి, నైపుణ్యం, జట్టు భావనను అద్భుతంగా ప్రదర్శించారు.
పోటీల ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి
100 మీటర్ల పరుగు (అమ్మాయిలు) 1వ బహుమతి – కెపిఆర్ఐటి, 2వ బహుమతి - విబిఐటి
100 మీటర్ల పరుగులు (అబ్బాయిలు) 1వ బహుమతి – విబిఐటి, 2వ బహుమతి - బ్రిలియంట్ కాలేజ్
వాలీబాల్ (అబ్బాయిలు) 1వ బహుమతి – విబిఐటి, 2వ బహుమతి – సంస్కృతి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీ
కబడ్డీ (అబ్బాయిలు) 1వ బహుమతి – శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీ, 2వ బహుమతి – విబిఐటి
షాట్‌పుట్ (అబ్బాయిలు) 1వ బహుమతి – హెచ్ఐటిఎస్, 2వ బహుమతి – శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీ
స్కిప్పింగ్ (అమ్మాయిలు) 1వ బహుమతి – విబిఐటి, 2వ బహుమతి – విజ్ఞాన్ ఉమెన్స్ కాలేజీ
కార్యక్రమం ముగింపు సందర్భంగా నిర్వహించిన వాలెడిక్టరీ ఫంక్షన్ లో విజేత కాలేజీలకు బహుమతులు మరియు ప్రశంసా పత్రాలు అందజేశారు. డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి,
ప్రిన్సిపాల్ పి. జానకి రాములు మాట్లాడుతూ విద్యార్థులను అభినందిస్తూ, క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, దృఢత్వం జట్టు భావనను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.