18-10-2025 04:33:01 PM
బైక్ ర్యాలీ ధర్నా నిరసన..
దోమకొండ (విజయక్రాంతి): దోమకొండ మండల కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అబ్రబోయిన రాజేందర్, మహిళా సంఘం నేత హాఫిజ ఆధ్వర్యంలో శనివారం బీసీ బంద్ సంపూర్ణంగా జరిగింది. భారీగా బైక్ ర్యాలీ నిర్వహించి, పాత బస్టాండ్ వద్ద ధర్నా చేశారు. 42% బీసీ రిజర్వేషన్ల సాధించే వరకు పోరాటం ఉధృతం చేస్తున్నామని బీసీ నేతలు స్పష్టం చేశారు. జీవోలతో బీసీ రిజర్వేషన్లలు రావన్నారు. రాజ్యాంగం 9వ షెడ్యూల్లో చేర్చడమే ఏకైక మార్గమని బీసీ నేతలు స్పష్టం చేశారు.
దశాబ్దాలుగా బీసీ రిజర్వేషన్లను కోర్టుల ద్వారా అగ్రవర్ణాలు అడ్డుకుంటున్నారని బీసీ నేతలు విమర్శించారు. తమిళనాడులో స్వర్గీయ సీఎం జయలలిత ఆధ్వర్యంలో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారన్నారు. తెలంగాణలో బీసీలను అన్ని రాజకీయ పార్టీలు కోట దక్కడంలో మోసం చేస్తున్నాయన్నారు. పోరాటంలో ఇది ఆరంభం మాత్రమేనని బీసీ రిజర్వేషన్ల పోరాటం ఉదృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో మండల బీసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.