calender_icon.png 18 October, 2025 | 2:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవయవాల్లో కళ్లు చాలా ప్రధానమైనవి

18-10-2025 12:00:00 AM

ఎస్పీ రోహిత్ రాజు 

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 17 (విజయక్రాంతి): కంటి చూపులు పరిరక్షించుకోవడానికి  స్క్రీనింగ్ టెస్ట్ లు నిర్వహించాలని అన్నారు. శుక్రవారం చిల్ల పోలీస్ హెడ్ క్వార్టర్ లో అధికారులకు సిబ్బంది ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మనిషి శరీరంలోని అన్ని అవయవాల్లో కళ్ళు చాలా ప్రధానమైనవన్నారు. సంక్రాంతి సమస్యలు తలెత్తకుండా కంటిచూపులు ఎప్పటికప్పుడు సరిగ్గా కాపాడుకోవాలని సూచించారు.

ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ  ఆధ్వర్యంలో ఉచితంగా కంటి పరీక్షల మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శరత్ మాక్సివిజన్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారుగా 150 మందికి పైగా కంటి పరీక్షలు (స్క్రీనింగ్,డిస్టెన్స్ విజిబిలిటీ టెస్ట్) చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ  ఆర్‌ఐలు సుధాకర్,నరసింహారావు,కృష్ణారావు,లాల్ బాబు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.