04-11-2025 08:04:18 PM
చిట్యాల,(విజయక్రాంతి): ఇటీవల రామన్న పేట మండలం సిరిపురం గ్రామంలో అకస్మాత్తుగా మరణించిన చలమల్ల శ్రీనివాస్ కుటుంబాన్ని ఆదుకోవడానికి... చేయి చేయి కలుపుదాం శ్రీనివాస్ కుటుంబానికి భరోసానిద్దాం... అనే నినాదానికి ముందుకు వచ్చి కొంగరి బాలరాజు అకౌంట్లో గ్రామస్థులు వేసిన డబ్బులు రూ.94,317 లను మంగళవారం గ్రామ పెద్దలు అందరూ కలిసి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. వారి భార్య పిల్లలకు ధైర్యం చెబుతూ శ్రీనివాస్ లేని లోటు తీర్చలేనిదని, ధైర్యంగా ముందుకు సాగాలని మీ కుటుంబానికి గ్రామం భరోసాగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో స్ఫూర్తినిస్తాయి అని అన్నారు. శ్రీనివాస్ కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలిపారు.