04-11-2025 08:01:30 PM
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): కోకాపేట్ లోని క్రీన్స్ విల్లాస్ లో మాజీ మంత్రి హరీష్ రావుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు శంభీపూర్ క్రిష్ణ పరమర్శించారు. ఇటీవల తన్నీరు హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ అనారోగ్యంతో మృతిచెందారు. ఈ సందర్భంగా తన్నీరు సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు మహేందర్ యాదవ్, కుంటి నాగరాజు, సుధాకర్ రెడ్డి, పాక్స్ డైరెక్టర్ జీతయ్య, బీఆర్ఎస్ మున్సిపల్ జనరల్ సెక్రటరీ కొల్తూర్ మల్లేష్ ముదిరాజ్ పాల్గొన్నారు.