calender_icon.png 10 January, 2026 | 11:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేద ప్రజల ఆరోగ్యానికి ఆర్థిక భరోసా

10-01-2026 01:08:14 AM

ఎమ్మెల్యే విజయుడు

అలంపూర్, జనవరి 9: నిరుపేద ప్రజలు అనారోగ్యానికి గురైనప్పుడు వారికి మెరుగైన వైద్య చికిత్స కోసం సీఎం సహాయనిధి సహకారంగా ఉంటుందని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. కర్నూలు పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ఎల్‌ఓసిలను ఎమ్మెల్యే శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. అలంపూర్ నియోజకవర్గంలో మొత్తం 114 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.30 లక్షల విలువైన ఎల్‌ఓసి కాపీలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..

అలంపూర్ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందేలా చేస్తానని తెలిపారు. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు కిషోర్ పరమేశ్వర్ రెడ్డి, ఆయా గ్రామాలకు చెందిన టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు గురించి ప్రస్తావించాలి. బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు గురించి  అసెంబ్లీలో గళం విప్పాలని ఎమ్మెల్యే విజయుడుని నాయకులు, కొమ్ము ప్రవీణ్ రాజ్, డేవిడ్ నాగేశ్వర్ రెడ్డి కోరారు