calender_icon.png 11 January, 2026 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్వే ట్రాక్ ఇబ్బందులు తొలుగుతాయి

10-01-2026 01:10:19 AM

ఎంపీ డీకే అరుణ

మహబూబ్‌నగర్, జనవరి 9 (విజయక్రాంతి): వాహనదారులు రైల్వే ట్రాక్ దాటేందుకు ఎదుర్కొనే ఇబ్బందులు త్వరలో తప్పనున్నాయని ఎంపీ డీకే అరుణ చెప్పారు.  మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని  మహబూబ్ నగర్ పట్టణంలోని టీడీ గుట్టలో రోడ్డు ఓవర్ బ్రిడ్జి, దేవరకద్ర పట్టణం లో లిమిటెడ్  హైట్ సబ్ వే లను రైల్వే శాఖ మంజూరు చేసిందన్నారు. దేవరకద్రకు మంజూరు చేసిన లిమిటెడ్ హైట్ సబ్ వే (LHS) కు ఫిబ్రవరిలో, టీడీ గుట్టలో మంజూరు అయిన ఆర్‌ఓబీ లకు ఏప్రిల్ లో టెండర్లను అధికారులు ఆహ్వానిస్తారని స్పష్టం చేశారు.

తిమ్మసానిపల్లి,వీరన్న పేట,బోయపల్లి ఆరబీ, మోతినగర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి లకు ఫిజబులిటీ రిపోర్ట్ పూర్తి అయ్యిందని తెలిపారు. రిపోర్ట్ ను రైల్వే బోర్డుకు అధికారులు పంపారన్నారు. అవి కూడా మార్చి,ఏప్రిల్ లో మంజూరు అవనున్నాయని,ఇవే కాకుండా శ్రీరామ్ నగర్, కౌకుంట్ల,జడ్చర్ల లకు సంబంధించిన ఆర్‌ఓబీ, ఆర్యూబీ ల గురించి గతంలో రైల్వే శాఖ మంత్రికి, రైల్వే జీఎం లకు వినతిపత్రాలు అందజేశమన్నారు.

వాటికి కూడా త్వరలో మంజూరు వస్తుందని అధికారులు తెలిపారు. మంజూరు అయిన రెండు బ్రిడ్జి లకు టెండర్లను త్వరలో ఆహ్వానించనున్నాన్నట్లు పేర్కొన్నారు. ఎక్కడెక్కడ భూ సేకరణ అవసరం ఉంటుంది అనే వివరాలు రైల్వే అధికారులు పంపుతామని తెలిపారు. జిల్లా అధికారులు భూసేకరణ త్వరితగతిన పూర్తి చేస్తే, పనులు త్వరగా పూర్తి అవుతాయన్నారు. దేవరకద్ర, టీడీగుట్ట రెండు బ్రిడ్జి లకు టెండర్లు పూర్తి అయిన వెంటనే  పనులు మొదలవుతాయని ఎంపీ తెలియజేశారు.