calender_icon.png 30 July, 2025 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం సేవించి వాహనాలు నడిపిన 20 మందికి జరిమానా

29-07-2025 07:13:58 PM

ఎల్లారెడ్డిపేట (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 20 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా సిరిసిల్ల సెకండ్ క్లాస్ కోర్ట్ న్యాయమూర్తి జయశ్రీ మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి జరిమానాలు విధించినట్లు ఎల్లారెడ్డిపేట ఎస్ఐ కే. రాహుల్ రెడ్డి(SI Rahul Reddy) తెలిపారు. పోలీసులు వాహన తనిఖీలు చేసిన సమయంలో16 మంది ద్విచక్ర వాహనదారులు, 1 ఆటో దారుడు, ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించి  పోలీసులకు దొరికారనీ, వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరచగా కోర్టు న్యాయమూర్తి జరిమానా విధించారనీ, వాహనాదారులు మద్యం సేవించి వాహనాలు నడిపినా, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ  తెలిపారు.