29-07-2025 07:09:51 PM
ప్రత్యేక పూజలు నిర్వహించిన మేయర్..
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రామారెడ్డి ఇసన్నపల్లిలో ఉన్న కాలభైరవ స్వామి ఆలయా(Sree Kalabhairava Swamy Temple)న్ని హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి(Mayor Gadwal Vijayalakshmi) కుటుంబ సమేతంగా మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దక్షిణ భారతదేశంలో ఏకైక దేవాలయం కాలభైరవ స్వామి ఆలయం అని మేయర్ విజయలక్ష్మికి స్థానికులు తెలిపారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేయర్ విజయలక్ష్మిని సన్మానించారు.