09-12-2025 03:35:06 PM
– అప్రమత్తతతో తప్పిన భారీ నష్టం
కల్వకుర్తి: కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామ శివారులోని బాలాజీ కాటన్ మిల్‌లో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మిల్లులో పనిచేస్తున్న సమయంలో యంత్రంలో షాక్ సర్క్యూట్ రావడంతో యంత్రం లోపలి భాగంలో మంటలు చెలరేగాయి. యంత్ర భాగాల్లో ఏర్పడిన ఘర్షణతో వెలువడిన నిప్పురవ్వలు సమీపంలో పత్తికి అంటుకోవడంతో ప్రమాదం జరిగినట్లు యజమానులు తెలిపారు. మంటలు ఒక్కసారిగా పైకి ఎగసిపడినా, సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది తక్షణమే చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు రూ,5 లక్షల విలువైన పత్తి దగ్ధమైనట్లు తెలుస్తుంది. సమయానికి స్పందించడంతో భారీ నష్టం తప్పిందని ఫైర్ సిబ్బంది తెలిపారు.