calender_icon.png 11 December, 2025 | 7:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వంట గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం

10-12-2025 02:22:27 AM

ఘట్‌కేసర్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): వంట చేస్తుండగా వంట గ్యాస్ సిలిండర్ లీకై మంటలు వ్యాపించిన సంఘటన పోచారం పోలీస్ స్టేషన్ పరిధి అన్నోజిగూడలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అన్నోజిగూడ ఎన్ టి పి సి  చౌరస్తా రోడ్డు వద్ద ఉన్న లీలా కూలర్ దుకాణంలో మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో రాజేష్ (36) వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ లీకై దుకాణం అంతా మంటలు వ్యాపించాయి.

దీంతో రాజేష్ స్వల్పంగా గాయపడ్డాడు. గమనిం చిన స్థానికులు అగ్ని ప్రమాదంపై 100 నెంబర్‌కు సమాచారం అందించారు. పోచారం పీఎస్ ఎస్‌ఐ కృష్ణయ్య, పెట్రోల్ మొబైల్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ స్టేషన్, విద్యుత్ శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. క్షతగాత్రుడు రాజేష్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.