calender_icon.png 4 July, 2025 | 9:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సనత్ నగర్‌లో అగ్నిప్రమాదం

04-07-2025 01:34:04 AM

సనత్ నగర్,జూలై 3 (విజయ క్రాంతి): విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో నష్టపోయిన కుటుంబానికి అండగా ఉంటామని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. గురువారం ఉదయం సనత్ నగర్‌లోని రాజరాజే శ్వరి నగర్‌లో రవి, మాధురి దంపతులు అద్దెకు ఉంటున్న ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి ఇంట్లోని సామగ్రి పూర్తిగా కాలిపోయాయి.

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని బాధితులను పరామ ర్శించి ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాము బయటకు వెళ్లిన సమ యంలో ప్రమాదం చోటు చేసుకుందని రవి దంపతులు వివరించారు. ఆ సమయంలో  ఇంట్లోనే ఉన్న 7 సంవత్సరాల తమ కుమారుడు మాన్విత్ ప్రమాదం గురించి ఫోన్ లో తమకు తెలపగా, హుటాహుటిన చేరుకున్నామని చెప్పారు.

బాధిత కుటుంబానికి ఎమ్మె ల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యక్తి గతం గా ఆర్ధిక సహాయం అందజేశారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన వారికి ధైర్యం చెప్పారు. అమీర్ పేట డిప్యూ టీ తహసీల్దార్ బాలరాజ్, ఆర్‌ఐ కిరణ్ లు సంఘ టన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. ఎమ్మెల్యే వెంట బీఆర్‌ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, నాయకులు సురేష్ గౌడ్, ఖలీల్, శేఖర్, రాజేష్ ముదిరాజ్, జమీర్ తదితరులు ఉన్నారు.