calender_icon.png 15 September, 2025 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాటన్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం

14-12-2024 03:37:29 PM

హైదరాబాద్‌: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని మల్లికార్జున కాటన్ మిల్లులో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. మంటల్లో సుమారు మూడు వేల క్వింటాళ్ల పత్తి దగ్ధమైందని, సుమారు రూ.2 కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. షార్ట్ సర్క్యూట్ తోనే అగ్నిప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. కాటన్ మిల్లు సమీపంలో పెద్దఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను గమనించిన స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు.