calender_icon.png 23 November, 2025 | 10:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్వకుర్తి నియోజకవర్గంలో పర్యాటక రంగ అభివృద్ధికి రూ.5 కోట్లు మంజూరు

10-02-2025 01:02:11 AM

పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

తలకొండపల్లి, ఫిబ్రవరి 9 (విజయ క్రాంతి): కల్వకుర్తి నియోజకవర్గంలో పర్యాటక రంగం అభివృద్ది కోసం తన మంత్రిత్వశాఖ ద్వార రూ.5 కోట్ల నిదులు మంజూరు చేస్తానని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు.

తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీశ్రీశ్రీ వేదాద్రి లక్ష్మినర్శింహా స్వామి బ్రహ్మోత్సవాలలో బాగంగా ఆదివారం వేద పండితుల మంత్రోచ్చరణల మద్య నిర్వహించిన లక్ష్మీ నర్శింహా స్వామి వారి కళ్యాణ మహోత్స వానికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు,కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి,రాష్ట్ర పొల్యుషన్ బోర్డ్ మెంబర్ బాలాజీసింగ్,మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్,ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి లు ముఖ్య అథితులుగా హాజరయ్యారు.

స్వామి కల్యానోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.ఆలయ నిర్వాహకులు ఆలయ అభివృద్ది కోసం రూ.10 కోట్లు మంజూరు చేయాలని మంత్రిని కోరారు.ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్తితిని దృష్టిలో పెట్టుకుని కల్వకుర్తి నియోజకవర్గంలో పర్యాటక రంగం అభి వృద్ది కోసం రూ.5   ఇస్తానన్నారు.ప్రతి ఒక్కరు ఆథ్యాత్మికతతో దైవ చింతన కలిగి ఉండాలన్నారు.

నేటి యువతరం ఎక్కువగా డ్రగ్స్, గుట్క, గంజాయి, మద్యపానం వంటి వాటికి అలవాటుపడి అసాంగిక కార్యక్ర మాలకు పాల్పడ్తునారని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలకు పాఠశాలలలో సంస్కారయుతమైన  విద్యను,వాటితోపాటు సాంస్కృతిక కళలు,ఆటల ద్వార సన్మార్గంలో నడిచే విదంగా తీర్చిదిద్దాలన్నారు.

ఎన్నో జన్మల పుణ్యమే మానవ జన్మ అని చెప్పారు.ప్రతి కుటుంబం సంవత్సరంలో ఒక్క సారి తీర్తయాత్రలు చేస్తే మనశ్శాంతితో పాటు ఆథ్యాత్మికత భావం పెంపొందు తుందని తెలిపారు. ఈ రోజులలో కుటుం బాలు వివాహాలు, శుభ కార్యాలకు అనవ సరమైన ఖర్చులు చేసి అప్పుల పాలై వీదిన పడుతున్నారని అన్నారు.

ఏ ప్రాంతంలో పర్యాటక రంగం అభివృద్ది చెందుతుందో ఆప్రాంత ప్రజల జీవన స్థితిగతులు బాగుంటాయని మంత్రి జూపల్లి కృష్ణారావు వివరించారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారా యణరెడ్డి మాట్లాడుతూ కల్వకుర్తి నియోజక వర్గం రాష్ట్ర రాజదాని హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉందని,ఈ ప్రాం తంలో   పర్యాటక రంగం అభివృద్దికి ఎంతో అవకాశం,వనరులు ఉన్నాయని మంత్రి దృష్టికి తెచ్చారు.మంత్రి ప్రకటించిన రూ.5 కోట్ల నిదులు ఎక్కడ సరిపోవని పెద్ద మొత్తంలో కేటాయించాలని ఎమ్మెల్యే మంత్రిని కోరారు.

ఈ కార్యక్రమంలో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి,కెవిఎన్ రెడ్డి, రజిని, మాజీ జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్,మాజీ ఎంపిపి శ్రీనివాస్ యాదవ్,పిఎసిఎస్ ఛైర్మన్ కేశవరెడ్డి,వైస్ ఛైర్మన్ రవికుమార్,కల్వకుర్తి మున్సిపల్ మాజీ ఛైర్మన్ ఎడ్మ సత్యం,కాంగ్రేస్ పార్టీ మండల అద్యక్షుడు డోకూరి ప్రభాకర్ రెడ్డి, కాసు శ్రీనివాస్ రెడ్డి, రఘురాములు, మాజీ సర్పంచులు భగవాన్ రెడ్డి, రమేష్ యాదవ్, వెంకటయ్య, లింగంగౌడ్, శ్రీరాములు ఆయా పార్టీల నాయకులు, వివిద గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.