13-11-2025 08:09:30 PM
ప్రమాద సమయంలో విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ సిబ్బంది..
సకాలంలో స్పందించిన జీడిమెట్ల పోలీసులు..
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ సర్కిల్(Qutubullapur GHMC circle) కార్యాలయంలోని రెవెన్యూ విభాగంలో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. అదే సమయంలో కార్యాలయంలోని విధులు నిర్వహిస్తున్న ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారు. వెంటనే స్పందించిన జీడిమెట్ల పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకుని మంటల్లో చిక్కుకున్న సిబ్బందిని బయటకు తీసుకువచ్చారు. సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఒకేసారి మంటలు చెలరేగాడంతో కార్యాలయంలోని ఫైల్స్, ఫర్నిచర్ కాలి బూడిద అయ్యాయి. ఫైర్ సిబ్బందికి సమాచారం అందడంతో ఫైర్ ఇంజిన్ లతో మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.