13-11-2025 08:52:41 PM
అన్ని వర్గాలకు సముచిత స్థానం..
ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి..
అడ్డాకుల: ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ అద్భుతంగా అభివృద్ధి వైపు అడుగులు వేద్దామని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని రాచర్ల గ్రామంలోని చెరువులో చేప పిల్లలను ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారులకు ఉపాధి అందించాలని లక్ష్యంతో ఉచితంగా ప్రభుత్వం చేప పిల్లలను వదలడం జరుగుతుందని తెలిపారు. మత్స్యకారులకు మునుముందు మరిన్ని మంచి రోజులు వస్తాయని తెలియజేశారు.
అనంతరం కాటవరం గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శేఖర్, మండల అధ్యక్షుడు తోట శ్రీహరి, విజయ మోహన్ రెడ్డి, దశరథ రెడ్డి, తిరుపతయ్య దేవేందర్ రెడ్డి, దిలీప్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.