13-11-2025 08:49:16 PM
కల్హేర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కల్హేర్ ఎస్సై ఎ.రవి గౌడ్ గురువారం ఫత్తేపూర్ చౌరస్థలో వాహనాల తనిఖీ నిర్వహించారు. ధ్రువపత్రాలు లేని వాహనాలకు జరిమానాలు విధించారు. ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ... మండల ప్రజలకు తెలియజేయునది ఏమనగా వాహనదారులు తప్పనిసరిగా ధ్రువపత్రాలను కలిగి ఉండాలని, వాహనదారులు హెల్మెట్, సిట్ బెల్టు ధరించాలన్నారు. లేకుంటే ప్రమాదాలు జరిగి కుటుంబాలకు విదిన పడే అవకాశం ఉంది తస్మాత్ జాగ్రత్త.. మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని, ఒకవేళ ఇస్తే తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి అట్టి వాహనాలను సీజ్ చేసి కేసు నమోదు చేసి జైలుకు పంపించడం జరుగుతుందని ఎస్సై ఎ.రవి గౌడ్ సూచించారు.