13-11-2025 09:05:35 PM
అశోక్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మందల కృష్ణారెడ్డి
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ 57వ డివిజన్ పరిధి అశోక్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న వైన్ షాపును పెట్టకూడదని గురువారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి అశోక్ కాలనీ అభివృద్ధి, దేవాలయ అభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మంద కృష్ణారెడ్డి, దేవాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు చింత శ్రీనివాస్ లు మాట్లాడుతూ అశోక్ కాలనీ ఆదర్శవంతమైన కాలనీ అని వైన్ షాప్ పెట్టడం వలన కాలనీ ప్రజలకు, విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతాయని అలాగే ఎన్జీవోస్ కాలనీ మెయిన్ రోడ్డు చాలా రద్దీ ప్రాంతమని ఇక్కడ ట్రాఫిక్ రీత్యా ఇబ్బందులు జరుగుతాయని, చుట్టుపక్కల కుటుంబాలు ఉన్నాయని, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఇబ్బందులు కలుగుతాయని ఎమ్మెల్యే కు విజ్ఞప్తి చేశామని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే అశోక్ కాలనీలో వైన్ షాప్ పెట్టకుండా చూస్తానని వారికి సానుకూలంగా హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్ కాలనీ అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షులు కొలను వెంకట రాజారెడ్డి, జనరల్ సెక్రెటరీ బూర రామచందర్, సరోత్తంరెడ్డి, కమిటీ సభ్యులు, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.