calender_icon.png 13 November, 2025 | 9:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బద్దిపడగ పాఠశాలలో షీ టీం అవగాహన సదస్సు

13-11-2025 08:13:10 PM

నంగునూరు: మండల పరిధిలోని బద్దిపడగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సిద్దిపేట షీ టీమ్ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు సైబర్ నేరాలు, డ్రగ్స్, ఈవ్ టీజింగ్ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాజగోపాల్పేట్ ఎస్ఐ వివేక్ సూచించారు. గుడ్ టచ్,బ్యాడ్ టచ్, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మైనర్ డ్రైవింగ్, బాల్య వివాహాల దుష్పరిణామాలు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ చట్టాలపై షీ టీమ్ బృందం అవగాహన కల్పించారు.

షీ టీమ్ విధి విధానాలు,సైబర్ నేరాల వల్ల ఎదురయ్యే నష్టాలు, పోక్సో చట్టాల ప్రాముఖ్యత వివరించారు.ఎవరైనా వేధించినా, వెంబడించినా, అవహేళనగా మాట్లాడినా వెంటనే డయల్ 100, లేదా షీటీమ్ వాట్సప్ నంబర్ 8712667434, స్నేహిత మహిళా సపోర్ట్ సెంటర్ 9494639498 లేదా మహిళా పోలీస్ స్టేషన్ 8712667435 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.ఈ అవగాహన కార్యక్రమంలో హెడ్మాస్టర్ పద్మ,ఉపాధ్యాయ బృందం,షీటీమ్ సిబ్బంది ఏఎస్ఐ కిషన్,కానిస్టేబుల్స్ ప్రవీణ్,రజిని, మమత తదితరులు పాల్గొన్నారు.