13-11-2025 08:32:21 PM
అడ్డకుల: ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎల్లవేళలా మీకు అండగా ఉంటానని చెబుతూ విద్యార్థులకు ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి షూలను తొడగించారు. గురువారం అడ్డాకుల మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బాలల దినోత్సవ సందర్భంగా స్నేహ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని విద్యార్థులకు షూ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి స్నేహ ఫౌండేషన్ ద్వారా పాఠశాలకు విద్యార్థులకు నైపుణ్యం పెరగడానికి కంప్యూటర్ సైన్స్ తో పాటు వారికి కావాల్సిన పుస్తకాలు, బ్యాగులు అందించడం అభినందనీయమన్నారు.
ఇప్పటికే పాఠశాలలో అవసరమైన సదుపాయాలను కల్పించడం జరుగుతుందని తెలిపారు. పాఠశాలలో విద్యాబోధన సక్రమంగా జరుగుతుందని తోటి విద్యార్థులకు సమాచారం అందించి మరింత మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు తీసుకువచ్చే బాధ్యత విద్యార్థులు సైతం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీఈవో ప్రవీణ్, ఎంఈఓ శ్రీనివాసులు, ఉపాధ్యాయురాలు జ్యోతి, ఉపాధ్యాయులు విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.