calender_icon.png 13 November, 2025 | 10:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ భార‌తి ద‌ర‌ఖాస్తుల‌ను వేగ‌వంతం చేయాలి!

13-11-2025 08:54:28 PM

జిల్లా క‌లెక్ట‌ర్ రాహుల్ రాజ్‌..

శివ్వంపేట‌: భూ భారతి, సాదాబైనామా దరఖాస్తుల పరిశీలనలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. గురువారం శివంపేట మండలం తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూ భారతి, సాదాబైనామా దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ భారతి, సాదా బైనామా దరఖాస్తులను వేగవంతంగా పరిశీలించాలని సూచించారు. ప్రతి దరఖాస్తుపై స్పష్టమైన పరిశీలన నివేదిక ఉండాలని, తిరస్కరణ జరిగితే, సవివరమైన కారణాలు తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. నవాబ్ పేట గ్రామంలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న భూ సమస్యను కలెక్టర్ క్షేత్రస్థాయిలో రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే విధంగా రెవెన్యూ సర్వే రికార్డులను పరిశీలించి సమగ్ర నివేదికను వారం రోజుల్లో పంపాలని రెవెన్యూ సర్వే అధికారులను ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మంలో త‌హ‌సీల్దార్‌, న‌యాబ్ త‌హ‌సీల్దార్ పాల్గొన్నారు.