calender_icon.png 13 November, 2025 | 9:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడా పోటీలు

13-11-2025 08:40:48 PM

లక్షెట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్థాయి అండర్-14, అండర్-19 క్రీడా పోటీలకు ముఖ్యఅతిథిగా మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ జాయింట్ సెక్రెటరీ జి.తిరుపతి గురువారం హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... విద్యార్థులకు చదువుతో పాటు, క్రీడలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. క్రీడలు విద్యార్థుల యొక్క శారీరక సామర్ధ్యాలను, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని పేర్కొన్నారు.

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని 13 బీసీ గురుకుల పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. ఈ పోటీలలో అండర్ 19 విభాగంలో లక్షెట్టిపేట్ బాలుర కళాశాల విజయం సాధించగా, అండర్ 14 విభాగంలో జాంగాన్ బాలుర పాఠశాల విద్యార్థులు విజయం సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారి  సేరు శ్రీధర్,పాఠశాల ప్రిన్సిపల్ సిహెచ్ మంగ,బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి, ఏటీపీ తిరుమల్, డిప్యూటీ వార్డెన్ వాణి, వ్యాయామ ఉపాధ్యాయులు, పాఠశాల ఉపాధ్యాయులు, బీసీ గురుకుల పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.