13-11-2025 08:56:56 PM
జాతీయ రహదారుల పెండింగ్ పరిహారం చెల్లించాలి
సింగరేణి పెండింగ్ భూసేకరణపై రివ్యూలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
రామగిరి (విజయక్రాంతి): భూ సేకరణ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ రామగిరి మండల తహసిల్దార్ కార్యాలయంలో సింగరేణి పెండింగ్ భూసేకరణ అంశంపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బుధవారం పేట, రామయ్య పల్లి, ఆదివారం పేట గ్రామాలలో సింగరేణి సంస్థ అవసరమైన భూ సేకరణ సంబంధించి వివరాలు అందించారని, ఎస్.డి.సి, ఎంపిడిఓ, తహసిల్దార్, సింగరేణి సంస్థ అధికారులు సమన్వయంతో పని చేస్తూ సజావుగా భూ సేకరణ జరిగే విధంగా చూడాలని అన్నారు. రామగిరి మండలంలో జాతీయ రహదారికి సంబంధించి పెండింగ్ పరిహార చెల్లింపులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో మంథని రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్, రామగిరి తహసిల్దార్ సుమన్, ఎంపిడిఓ, ఎంపిఓ, సింగరేణి అధికారులు,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.